ఎస్సై కుటుంబానికి స్నేహితుల సాయం.
– తల్లిదండ్రుల పేర 2020 బ్యాచ్ ఎస్సైలు రూ.16.15లక్షల ఎఫ్డీ
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఇటీవల మృతి చెందిన వాజేడు ఎస్సై హరీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన స్నేహితులు అండగా నిలిచారు. 2020 ఎస్సై బ్యాచ్ కు చెందిన హరీష్ ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా సేవలు అందిస్తున్న క్రమంలో వ్యక్తిగత కారణాల చేత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే హరీష్ బ్యాచ్ కు చెందిన తోటి ఎస్సైల మిత్ర బృందం గురువారం భూపాలపల్లిజిల్లా గోరికొత్తపల్లి మండలం లోని వెంకటేశ్వర్లపల్లిలో హరీష్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. తల్లిదండ్రుల పేరిట రూ.16.15లక్షల ఎఫ్డీ చేసి పతంరాలను అందించారు. పోలీసు శాఖలో స్నేహితుడు హరీష్ సేవలు వెలకట్టలేనివని, భౌతికంగా తమ నుంచి దూరమైనా జ్క్షాపకాలను మాత్రం తన మదిలో పదిలంగా ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, కన్న కొడుకు దూరం అయినా కూడా తాము మీ కొడుకులమేనని, ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దశదిన కార్యక్రమానికి హాజరై దివంగత ఎస్సై హరీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.