ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధుల పై ప్రత్యేక దృష్టి
– ఐదు గ్రామాలకు అందుబాటులో కంటైనర్ ఆసుపత్రి.
– ఏడు చర్లపల్లి లో రెండవ కంటైనర్ ఆసుపత్రి ని ప్రారంభించిన మంత్రి సీతక్క
వెంకటాపురంనూగూరు:ఏజెన్సీప్రాంతంలో సీజనల్ వ్యాధు లపై ప్రత్యేక దృష్టి తో ఐదు మారుమూల గ్రామాల కోసం జిల్లా లో రెండవ కంటైనర్ ఆసుపత్రి (అదనపు ఆరోగ్య ఉపకేంద్రం) ను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం వాజేడు మండలం ఎడ్జర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రి ( అదనపు ఆరోగ్య ఉపకేంద్రం ) ను రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫర, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఏ ఎస్పి శివం ఉపాద్యాయ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏజన్సీ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు నివాసిస్తున్నారని , ఆరోగ్య సమస్యలు వస్తె అనేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రత్యేక చొరవ తో జిల్లాలో రెండవ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి సారి పోచాపూర్ గ్రామం లో ఏర్పాటు చేశామని అదేవిధంగా ఎడ్జర్లపల్లిలో ఎర్పాటు చేశామని తెలిపారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం నాలుగు బెడ్స్, మందులు ఏర్పాటు చేశామని ప్రతి రోజు ఒక ఏఎన్ఎం ఒక ఆశా వర్కర్ విధులు నిర్వర్తిస్తారని, వారానికి రెండు రోజులు డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసు కోవడం జరిగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెట్పిటీసీ పాయం రమణ, డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, మండల ప్రత్యేక అధికారి డి సి ఓ సర్దార్ సింగ్, తహశీల్దారు, ఎంపి డి ఓ, ప్రాజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.