చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు సేవా అవార్డు

Written by telangana jyothi

Published on:

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థకు సేవా అవార్డు

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెకటాపురం చెందిన చేయూత ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో అరుదైన గౌరవం దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన యువతరం సేవా సమితి వారి పదవ వార్షికోత్సవం సందర్భం గా రెండు తెలుగు రాష్ట్రాల సంస్థలను ఆహ్వానించి ఆత్మీయం గా సన్మానించారు. అందులో భాగంగా నిత్యం సేవా కార్యక్ర మాలు చేస్తున్న చేయూత ఫౌండేషన్ ను ఎంపిక చేసిన యువతరం సంస్థ ప్రతినిధులు సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ కు మెమోంటో అందించి, శాలువాలతో సత్క రించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల ,అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు చేయూత ఫౌండేషన్ సేవా సంస్థ అధ్యక్షులు చిడెం సాయి ప్రకాశ్ ను పలువురు అభినందించారు.

Leave a comment