Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

వెంకటాపురం బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

On: January 21, 2026 6:12 PM

వెంకటాపురం బస్ స్టేషన్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

వెంకటాపురం, జనవరి 21 (తెలంగాణ జ్యోతి): మేడారం మహా జాతర సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం బస్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సుల నిలుపుదలతో పాటు ప్రయాణికుల సౌకర్యాల కోసం బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జుమ్మిలాల్ పర్యవేక్షణలో వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్మికులు బస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి జి. ప్రవీణ్ ఆధ్వర్యంలో బస్ కాంప్లెక్స్ ఆవరణను పరిశుభ్రం చేయించి, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల పైపు నుంచి జాతరకు వచ్చే ప్రత్యేక బస్సులతో పాటు వెంకటాపురం కేంద్రంగా నడిచే స్పెషల్ బస్సుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆర్టీసీ స్థలంలో ప్రయాణికుల సౌకర్యార్థం మంచినీటి వసతి, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా, ఎంపీడీవో ఆదేశాల మేరకు జాతరకు వారం రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!