గిరిజన విద్యార్థులకు తప్పని తిప్పలు
– ఇబ్బందులు పట్టించుకోని అధికారులు.
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని బయ్యక్క పేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యా ర్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయి సంవత్సరకాలం అవుతున్న అధికారులు పట్టించుకోక, వాటర్ ప్లాంట్ ఉన్న చెడిపోవడంతో త్రాగు నీరు లేక చేతి పంపు నీరు తాగడం వలన అనారోగ్య పాలవుతు న్నారు. చేతి పంపుకి చుట్టూ ప్లాట్ఫారం లేక విద్యార్థులు స్నానాలు చేసిన నీళ్లు మల్లి తిరిగి అదే బోర్లోకి ఇంకుతుండ డంతో విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. అదేవిధంగా వంటశాల లేక చెట్ల కింద వంట చేయడం, విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాలంటే ఊరు చివరన ఉన్న వాగు దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. తమకు మంచినీటి బోరు, వంటశాల, బాత్రూములు కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోవడం లేదన్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన ఆశ్రమ పాఠ శాలలో మేలైన వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.