చిన్న బోయినపల్లిలో ఘనంగా మల్లన్న పట్నాలు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని చిన్న బోయినపల్లిలో ఘనంగా మల్లన్న పట్నాలను ఆదివారం నిర్వహించారు. చిన్న బోయినపల్లి కి చెందిన సుంక శ్రీనివాసు కూర్మ గణేష్ హోటల్ యజమాని మల్లన్న, ఎల్లమ్మ, ఇళ్లలో దేవుని పట్నాలు నిర్వహించగా కురుమ కులస్తులు కుల పెద్ద మనుషులు డప్పు చెప్పులతో మంగళ వాయిద్యం తో పుట్ట బంగారం నీ తీసుకువచ్చి జరిపినన పట్నాలకు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు ఎలకపల్లి శ్రీనివాస్, కుర్మాకుల పెద్దమనిషి గుడుగుంట్ల మల్లయ్య, కురుమ కుల బాంధవులు శివాపురం, గోగుపల్లి , కురుమ కులస్తులు పాల్గొన్నారు.