50 లైట్లు ఫ్యాన్లు, డస్ట్ బిన్ లు వితరణ.

Written by telangana jyothi

Published on:

50 లైట్లు ఫ్యాన్లు, డస్ట్ బిన్ లు వితరణ.

తెలంగాణ జ్యోతి, కాళేశ్వరం : ఎన్టిపిసి రామగుండం సంస్థ తెలంగాణా అధికారులను సి ఎస్ ఆర్ నిధులతో భక్తుల సౌకర్యార్థమై అభివృద్ధి పనులు చేయించవలసిందిగా ఎస్. మహేష్ కార్యనిర్వహణాధికారి కోరినందున దానికి స్పందించి న శ్రీ కేదార్ రంజన్ పాండు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థమై ఎన్టిపిసి-సి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానమునకు 50 ఎల్ఈడి లైట్స్,50 ఫ్యాన్లు, 50 డస్ట్ బిన్లు దేవస్థానం సూపరింటెండెంట్ కు అందజేశారు. వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని ఎన్ టి పి సి యాజమాన్యం తెలిపారు. ముందుగా  వారికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకము చేయించి శ్రీ పార్వతి అమ్మ వారి ఆలయంలో వేద పండితులు, అర్చక స్వాములు స్వామి వారి శేష వస్త్రములు, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగిం ది. ఈ కార్యక్రమంలో ఎస్.ప్రశాంత్ డీజీఎం (హెచ్ఆర్), ఆదేశ్ పాండే, రవి సభావత్, వేముగంటి యుగేందర్ రావు, ఆరెల్లి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఇందుకు గాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు ఎన్ టి పి సి యాజమాన్యం కు దేవస్థానం తరఫున ఆలయ సూపరింటెండెంట్ ధన్యవాదాలు తెలుపుతూ భక్తుల సౌకర్యార్థమై మరికొన్ని అభివృద్ధి పనులు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. దానికి సంస్థ అధికారులు సానుకూలంగా స్పందించారని ఆలయ సూపరిం టెండెంట్ బుర్రి శ్రీనివాస్ తెలిపారు.

Leave a comment