ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
– మహాత్మగాంధీ విగ్రహానికి బిఆర్ఎస్ వినతిపత్రం
వెంకటాపురంనూగూరు, తెలంగాణ జ్యోతి : కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మోసపూరిత మైన 420 వాగ్దానాలు చేసి 420 రోజులు కావస్తున్న నేటికి అమలు లేదని ములుగు జిల్లా వెంకటాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని గాంధీ మహాత్మ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేషారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల్లో విజయం సాధించి అదికారం లోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలపై రకరకాల సాకులతో కాల యాపన చేస్తున్నారని, లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిం దని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు బరోసా ఇంకా అనేక వాగ్దానాలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని పేర్కొన్నారు. రైతు భరోసా, రైతు బంధు పై రకరకాల ప్రకటనలు చేస్తున్నారని, నేటి వరకు రైతులు ఖాతాలో డబ్బులు పడలేదని విమర్శించారు. యువత కు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యో గులను మోసం చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా 2 లక్షల రుణమాఫీ, మహిళల ఖాతాలలో డబ్బులు జమ, ఇంకా అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరుగుబాటు చేసి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బిఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడ వర్తి నరసింహమూర్తి, నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, డర్ర దామోదర్, సీనియర్ నాయకులు న్యాయవాది చిడెం రవికుమార్, మాజీ సర్పంచ్ ఆదిలక్ష్మి, మాజీ ఎంపిటిసి సాంబశివరావు, జాగర శాంతమూర్తి యాదవ్, జాగర శివాజీ యాదవ్, గడ్డం వివేక్, జినకమ్మ ఇంకా పలువురు కార్యకర్తలు, నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.