ఏజెన్సీలో అక్రమ నిర్మాణాలపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలి
– తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి రాజబాబు డిమాండ్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల తహసిల్దార్ కు ఏజెన్సీలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలపై ఎన్టీఆర్ కేసులు నమోదు చేయాలని తుడుందెబ్బ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి రాజబాబు బుధవారం వినతిపత్రం సమర్పిం చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ఆదివాసీల భూభాగం కలిగిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు, భూ బదలాయింపులు నిషేధం అయి నప్పటికీ ఎల్ టి ఆర్ 1/70 చట్టాలకు విరుద్ధంగా భూములను కొనుగోల్లు జరుపుతున్నార న్నారు. అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజనేతరులు, మండలంలోని చెరు కూరు, ధర్మవరం,పేరూరు, వాజేడు గ్రామాలలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లు,మరియు బహుళ అంతస్తుల నిర్మాణాలపై తక్షణమే ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అక్రమ భవనాలకు గ్రామపంచాయతీ అధికారులు ఇంటి పన్ను రసీదులు, విద్యుత్ మీటరు ఇవ్వకూడదని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రెవిన్యూ అధికారులు సంబంధిత అధికా రులు, ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలుపరిచిన నాడు ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఆగిపోతాయని ఆయన అన్నారు. అధికారులు పక్షపాతంగా వ్యవహరిం చడం వలన ఆదివాసి చట్టాలకు తూట్లు పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ తహసిల్దార్ తదితర శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకొని గిరిజన సంక్షేమ చట్టాలు పరిరక్షించాలని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టీ రాజ బాబు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.