ఆపరేషన్ కగార్ కు సింధూర్ ఎఫెక్ట్
– కర్రెగుట్టల నుండి వెనక్కి మళ్ళీ న బలగాలు
– నిలిచిపోయిన హెలికాప్టర్ల రాకపోకలు
వెంకటాపురం నూగూరు,తెలంగాణజ్యోతి : ఆపరేషన్ కగార్ కారణంగా మోహరించి ఉన్న సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు సింధూర్ ఎఫెక్ట్ తో శనివారం వేకువ జామునుండే వెళ్లి పోవటం ప్రారంభించాయి. కర్రెగుట్ట లోని భద్రత బలగాలకు గత రెండు వారాలుగా నిత్యవసర వస్తువులు, వాటర్ బాటిల్ తదితర వస్తువులను తరలించేందుకు వెంకటాపురం నుండే హెలికాప్టర్ సేవలను వినియోగిస్తున్నారు.వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాల లో భద్రత బలగాలకు చికిత్స నిమిత్తం ప్రత్యేకంగా బెడ్స్ కేటాయించారు. శనివారం ఉదయం నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బలగాలు వారి, వారి క్యాంపులకు తరలి వెళ్ళిపోయారు.