గ్రామాల్లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవి పేట గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలతో అంగన్వాడి కేంద్రంలో పండుగ వాతావ రణం నెలకొంది. అంగన్వాడి కేంద్రాలకు విచ్చేసే చిన్నారులను చిన్ని కృష్ణుని గోపికల వేషధారణలో అందంగా ముస్తాబ్ చేసి అలంకరించారు. చిన్ని కృష్ణుని వేషధారణలో కేతిరి రాజేష్ ఖన్నా (రిత్విక్) చిన్నారులతో ఉట్టిని కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. కాగా మండలంలోని మిగతా అంగన్వాడి కేంద్రాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పిల్లల కు అటుకులు, కొబ్బరి, చేగోడీలు, లడ్డూలు, సీట్లు పంపిణీ చేశారు. చిన్ని కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలో ఉన్న తను చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసి పోయారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.