చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
– బిట్స్ ప్రిన్సిపల్స్ రజినీకాంత్, కవిత
– ఖమ్మంలో జరిగిన కరాటే పోటీల్లో 13మంది చిన్నారులకు గోల్డ్ మెడల్స్
ములుగు, జనవరి7, తెలంగాణ జ్యోతి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడాల్లోనూ రాణించాలని బాలాజీ ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ కొలగాని రజినీకాత్, గిరిగాని కవిత పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం ఖమ్మంలో వరల్డ్ ఫునకోషి షోటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ములుగుకు చెందిన బిట్స్ స్కూల్లో చదువుతున్న 13మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించారు. బుధవారం విద్యార్థులను ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయు లు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారులకు వ్యక్తిగత రక్షణ కోసం కరాటే నేర్పిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. వివిధ యాక్టివిటీస్తోపాటు చదువుల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సాహాన్నందించాలన్నారు. కరాటేతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందు తుందని, విద్యార్థుల్లో శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమవు తుందన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు లాస్య, ఆరాధ్య, హాసిని, అచ్యుత్ కిరణ్, అకుల్ చైతన్య, నవనీత్, సాత్విక్, స్నిగ్ధ, విగ్నేష్ విహాన్, సిరిక, దివ్య, రియాన్షిక, ఆదిత్యలను బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ, అబ్‌సర్వర్ శ్రీధర్, ఉపాధ్యాయులు అభినందించారు. రాబోవు రోజుల్లో మరిన్ని కాంపిటేషన్స్కు విద్యార్థులను సమాయత్తం చేస్తామని ప్రిన్సిపల్స్ స్పష్టం చేశారు.





