కమలాపురం బిల్ట్ కర్మాగారంలో షార్ట్ సర్క్యూట్
ఏటూరునాగారం, తెలంగాణా జ్యోతి ప్రతినిధి : మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కర్మాగారంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కమలాపురం బిల్ట్ కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే పేపర్ కు విలువ పడిపోవడంతో 2014 సంవత్సరంలో యాజ మాన్యం ఫ్యాక్టరీని మూసివేసిన సంగతి విదితమే. దశాబ్ద కాలంగా మూతపడిన ఫ్యాక్టరీని ఈ ఏడాది ఓ ప్రైవేటు కంపెనీ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో వస్తువులను తొలగింపు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. కార్మికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది ఫ్యాక్టరీ అధికారులు తేల్చాల్సి ఉంది.