ప్రజలకు జవాబుదారి పోలీస్ : ఎస్పీ కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : పోలీసులు ప్రజలకు జవాబు దారీగా పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 13 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజల సమస్యలపై అలసత్వం వద్దని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పి ఆదేశించారు. పోలీసులు ప్రజలతో స్నేపూర్వకంగావ్యవహరించాలని, విధులు నిర్వహించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.