జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సాత్విక శ్రీని ఎంపిక
వెంకటాపూర్, డిసెంబర్ 23 (తెలంగాణ జ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన మద్దెల సాత్విక శ్రీని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన మద్దెల సంధ్య–సురేష్‌ల కుమార్తె అయిన సాత్విక శ్రీని ఈ ఘనత సాధించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆమె ఎంపిక పట్ల ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పైడాకుల అశోక్, ప్రెసిడెంట్ భూక్య రవీందర్, సెక్రటరీ పోలెపాక జనార్ధన్, ఉపాధ్యక్షులు–సహాయ కార్యదర్శులు చింతకృష్ణ, గోగు రాజయ్య, నవీన్, కట్టెకోళ్ళ వెంకటేష్, పోరిక రాజ్‌కుమార్, హర్షం రఘు, వేణు, సభ్యులు శ్రావణ్, రాహుల్, సురేందర్, శ్రీను తదితరులు అభినందనలు తెలిపారు. జాతీయ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలోనూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.






