వితంతువులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణీ
వెంకటాపురం నూగూరు, జనవరి 3 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద వితంతువులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. సంస్థ మండల కోఆర్డినేటర్ జి. ప్రేమ్ రాజు ఆధ్వర్యంలో రాక్ చర్చ్ ప్రాంగణంలో సుమారు 200 మంది వితంతు మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం సర్పంచ్ ఎస్. రాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ సమాజ హితార్థంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియా డారు. కార్యక్రమంలో పాస్టర్లు కాల ప్రసాద్, సత్యానందం, నతానియల్, నెహెమ్యా, కృపానిధి తదితరులు పాల్గొన్నారు.







