శ్రీ వివేకానంద స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు
మల్లంపల్లి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని శ్రీ వివేకా నంద హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో స్కూలు విద్యార్థులు వేసిన ముగ్గులు సంక్రాంతి ప్రత్యేక తలను తెలిపే విధంగా ముగ్గులు వేయడం పలువురిని ఆశ్చర్య పరిచాయి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి స్కూల్ యజమాన్యం వారికి బహుమతులు అందించారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్ర మంలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు.