జీవంతరావుపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
ములుగు, జనవరి 13, తెలంగాణ జ్యోతి : సంక్రాంతి పండుగ సందర్భం గా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లి గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మంత్రి సీతక్క చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని, పాల్గొన్న అందరికీ పాటిసిపేషన్ గిఫ్టులు ఇస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.






