వివేకవర్ధిని స్కూల్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
– రంగవళ్లులు, వేశ దారణలతో ఆకట్టుకున్న చిన్నారులు
ములుగుప్రతినిధి, జనవరి10,తెలంగాణజ్యోతి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రం లోని వివేకవర్ధిని, బ్రిలియంట్ ఉన్నత పాఠశాలల్లో శనివారం సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా చిన్నారులు రంగురంగుల ముగ్గులు వేయగా పండుగశోభను సంతరించు కుంది. ఈ సందర్భంగా విద్యార్థులు హరిదాసు సంప్రదాయ వస్త్రధారణలో అలరించి, భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు చిర్ర నరేష్ గౌడ్, ముద్దం సంతోష్ చక్రవర్తి, ప్రిన్సిపల్ ఎస్.ఎన్.హరిలు మాట్లాడుతూ విద్యార్థుల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యత, సామాజిక విలువలపై అవగాహన పెంపొందించడమే తమ ఉద్దేశ్యమన్నారు.
పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని, చిన్న వయసులోనే పిల్లల్లో ఆ భావన నాటితే భవిష్యత్తులో వారు తమ వారసత్వాన్ని గౌరవించే పౌరులుగా, క్రమశిక్షణతో ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగోళి ముగ్గులు వేశారు. సంప్రదాయ వేషధారణ, భక్తిగీతాలు, పండుగకు సంబంధించిన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సంక్రాంతి సంబరాలు విద్యార్థుల్లో ఆనందం, ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించా యని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.







