19, 26వ తేదీల్లో ములుగులో సదరం క్యాంపులు
– సద్వినియోగం చేసుకోవాలని జిల్లాఆస్పత్రి సూపరింటెండెంట్ సూచన
ములుగు : ములుగులోని జిల్లా ఆస్పత్రిలో ఈనెల 19, 26తేదీల్లో వికలాంగులకు సదరం క్యాంపులు నిర్వహించ నున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న శారీరక, వినికిడి, మూగ లోపం కలిగిన వారికి, ఈనెల 26న శారీరక, కంటి చూపు లోపం కలిగిన వారికి క్యాంపు నిర్వహించనున్నామని తెలిపారు. కొత్త సదరం సర్టిఫికెట్ కోసం, రెన్యువల్ కోసం సమీపంలోని మీసేవా కేంద్రాలకు వెళ్లి ఆదార్ కార్డు ద్వారా రూ.35లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 10గంటల నుంచి క్యాంపు ప్రారంభమవుతుందని, సంబంధిత వైద్యులు పరీక్షలు చేసి అర్హులైన వారికి సర్టఫికెట్లు జారీ చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 19న శారీరక, చెవిటి, మూగ వికలాంగులకు కొత్తవి 15, రెన్యువల్ 15 చొప్పున, ఈనెల 26 శారీరక, కంటి చూపుకు సంబంధించి కొత్తవి 15, రెన్యువల్ 15 చొప్పున సర్టిఫికెట్లు జారీ చేయనున్నామని, స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే శిబిరానికి హాజరు కావాలని, ఇతరులు వచ్చి ఇబ్బదులకు గురికావొద్దని డాక్టర్ జగదీష్ సూచించారు.