ఆర్టీసీ బస్సు లారి ఢీ – 15 మందికి గాయాలు
– ముగ్గురిని వరంగల్ కు తరలింపు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటనలో 15మంది ప్రయాణీకులు, కండక్టర్ కు గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం పందికుంట మల్లంపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. ప్రయాణీకులు, ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు వైపు నుంచి హన్మకొండకు 33మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పందికుంట మల్లంపల్లి గ్రామాల మధ్య టీఎస్ 03 యూబీ 6688 నెంబరుగల ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి ప్రయాణీకులు, కండక్టర్ కు గాయాలయ్యాయి. వారిని 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా, జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వన్ వే ఏర్పాటు చేయడంతో బస్సు డ్రైవర్ ఇండికేషన్ ఇచ్చినా లారీ డ్రైవర్ ప్రమాద కరంగా వచ్చి బస్సును ఢీకొట్టినట్లు ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కె.భానుకిరణ్, వరంగల్ 2 డిపో మేనేజర్ సురేష్, 1డిపో మేనేజర్ మోహన్ రావు, అసిస్టెంట్ మేనేజర్ జ్యోత్స్న తదితరులు సంఘటన వివరాలు తెలుసుకొని ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.