పంట పొలాలకు పాకాల నీళ్లు
– కట్టమైసమ్మకు పూజలుచేసి నీళ్లు విడుదల చేసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట, తెలంగాణ జ్యోతి : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం పంటపొలాలకు పాకాల నీటిని విడుదల చేశారు. కట్టమైసమ్మకు మొక్కులు చెల్లించిన అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. గేట్లు ఎత్తి పంట పొలాలకు నీటిని వదిలిన ఎమ్మెల్యే రైతులు పాకాల సరస్సు నీటిని ఉపయోగించుకొని పంటలు పండించు కోవాలని ఎమ్మెల్యే దొంతి సూచించారు. వర్షాలు వెనక్కి తగ్గినా రైతులు ఇబ్బందులు పడొద్దని, వరినార్లు పోసుకొని పాకాల సరస్సు నీటిని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వరంగల్ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీను, అశోకనగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏల్ది శ్రీను, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.