ఉధృతంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
– టేకులగూడెం జాతీయ రహదారిపై కి చేరిన వరద నీరు.
– జాతీయ రహదారి మూసివేత – చత్తీస్గడ్ టు తెలంగాణ రాకపోకలు బంద్.
– అప్రమత్తమైన అధికారులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : గోదావరి వరద నీటిమట్టం గంట గంటకు పెరిగి పోతుండటంతో ములు గు జిల్లా వాజేడు మండలం టెకులగూడెం మర్రిమాకు వాగు వద్ద గోదారి వరద నీరు జాతీయ రహదారి 163 పైకి చేరటం తో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి వాజేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి విజయ, పేరూరు ఎస్సై జి. కృష్ణ ప్రసాద్, రెవిన్యూ శాఖ అధికారులు గ్రామస్తులు సహకారంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేస్తూ బారికేట్లు ఏర్పాటు చేశారు. మర్రిమాకు వంతెన గుండా వరద నీరు టేకులగూడెం జాతీయ రహదారిపై సుమారు ఎనిమిది అడుగులకు పైగా వరద నీరు చేరడంతో అంతర్రాష్ట్ర జాతీయ రహదారి పై రాకపోకలు స్తంభించిపోయాయి. చత్తీస్గడ్ భూపాలపట్నం నుండి తెలంగాణ కు వచ్చే వాహనాలు వందల సంఖ్యలో ఇరువైపులా బారులు తీరి ఉన్నాయి. అంతేకాక పేరూరు, చంద్రుపట్ల గ్రామాల మధ్య మర్రిమాకు వాగు గుండా గోదావరి వరద నీరు చొచ్చుకు రావడంతో రహదారి పైకి వరద నీరు చేరటంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి పోయాయి. గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా ప్రజ లు ఎవరైనా చేపల వేటకు వెళ్లవద్దని, వాగులు దాటే ప్రయ త్నాలు చేయవద్దని, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ళ వద్దని టేకులగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో వాజేడు మండ లం పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. జి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యం లో మంగళవారం ఉదయం మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.