ములుగు సమీప అడవిలో చిరుత సంచారం
– మదనపల్లి ఫారెస్ట్ లో చిరుత ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు
– భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ములుగు ప్రతినిధి : ములుగు మండలం మదనపల్లి శివారు అటవీ ప్రాంత సమీపంలో ఉన్న పంట పొలాల్లో చిరుత పులి అడుగులను గుర్తించిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారు లకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ ఆధ్వర్యంలో చిరుత జాడను పరిశీలించి అడుగుల కొలతలు తీసుకున్నారు. ఈ చిరుత మహబూబాబాద్ జిల్లా పాకాల అడవి ప్రాంతం నుంచి ములుగు వైపుకు వచ్చినట్లు రేంజ్ అధికారి శంకర్ తెలిపారు. సుమారు మూడేళ్ల వయ సున్న మగ చిరుతపులిగా ధ్రువీకరించారు. మదనపల్లి నుంచి జాకారం ప్రేమ్ నగర్ అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అడుగుల జాడను బట్టి అటవీ అధికారులు పేర్కొన్నారు. చిరుత సంచ రిస్తున్నందున పశువుల కాపరులతో పాటు సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రేమ్ నగర్, మదనపల్లి, జాకారం, మాన్సింగ్ తండా ప్రజలు తమ గ్రామ సమీప అడవుల్లోకి వెళ్ళొద్దని ఆదేశించారు. పశువుల కాపర్లు పొలాల వద్దకు వెళ్లే కూలీ లకు పాదముద్రలు, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే ఫారెస్ట్ అధికా రులకు 9849358923, 9440810881 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కాగా, చిరుతపులిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ములుగు మండలం గట్టమ్మ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి చిరుత కనిపించినట్లు ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.