బహుల అంతస్తుల నిర్మాణాలపై తహసిల్దార్ కు వినతి

బహుల అంతస్తుల నిర్మాణాలపై తహసిల్దార్ కు వినతి

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం:  మండల కేంద్రంలో చేపడు తున్న బహుల అంతస్తుల భవన నిర్మాణాలపై తహసిల్దార్ వేణు గోపాల్ కు తుడుందెబ్బ నాయకులు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పాపారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి పోడం బాబులు మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలంలోని 1/70 యాక్ట్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను తక్షణమే చట్ట పరంగా నిలిపివేయాలని అన్నారు. అంతేకాకుండా ఏజెన్సీలో గ్రామాల్లో 1/70 పిసా చట్ట ప్రకారం ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని, భూ భారతి చట్టం ప్రకారం పిసా గ్రామ సభల ద్వారా ఆదివాసులకు పట్టాలు వచ్చే విధంగా ఉండాలన్నారు. షెడ్యూల్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు పీసా గ్రామ పంచాయతీ ద్వారా అర్హులైన ఆదివాసులకు చేకూర్చాలన్నారు. మండలంలో 16 ఇసుక ర్యాంపులు మంజూరు కాగా పిసా చట్ట పరంగా నడిచేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సి ఎస్టీ కమిటీ ములుగు సభ్యులు సునార్కని రాంబాబు, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment