సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి 

సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి 

సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి 

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ

వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : బీజేపీ నియంత పాలనకు వ్యతిరేకంగా ఈనెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సకల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ అన్నారు. ములుగు జిల్లా  వెంకటాపురం మండల కమిటీ సమావేశం కుమ్మరి శీను అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా సాంబశివ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నూతన కార్మిక కోడ్ ల పేరుతో నాలుగు కోడ్ లను తీసుకవచ్చి ప్రజాస్వామ్య హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కార్మికులను టార్గెట్ చేస్తూ కార్పొరేట్ సంస్థల పట్ల అనుకూల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును, ప్రశ్నించే హక్కును, ఉద్యోగ భద్రత హక్కులను, జీతాలు పెంచమనే హక్కులను, యూనియన్స్ పెట్టుకొనే హక్కులను, అన్నివిధాలుగా కార్మికులకు నష్ట పరిచే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఉద్యోగస్తులను దోపిడీ చేస్తూ లాభాలు గడిస్తున్న కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూన్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని ఆయన అన్నారు. కార్మికులు ఉద్యోగస్తులు చాలీచాలని వేతనాలతో  సమస్యలు ఎదుర్కొంటున్నరని, కార్మిక ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. భారతదేశ అభివృద్ధిలో కార్మిక శ్రమ కీలకపాత్ర పోషిస్తుందని కానీ పాలకవర్గ విధానాల వల్ల శ్రమ కు తగ్గ ఫలితం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. శ్రమకు విలువ లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేయకుండా ఆపాలనీ పిలుపునిచ్చారు. కార్మిక వర్గ రక్షణ కోసం దేశవ్యాప్త కార్మిక సంఘాలు అన్ని ఒక్క తాటి పైకి వచ్చి పోరాటానికి సిద్ధం అవుతున్నాయని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడటం కోసం, జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు మండల కమిటీ సభ్యులు కుమ్మరి శీను కట్ల నర్సింహ చారి, చిట్టెం ఆదినారాయణ,కంఠం సత్యం, తోట నాగేశ్వరరావు జమ్మిడి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment