317 జీవో రద్దు చెయ్యాలని మంత్రి సీతక్కకు వినతి

317 జీవో రద్దు చెయ్యాలని మంత్రి సీతక్కకు వినతి

ములుగు, తెలంగాణ జ్యోతి : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలకు కారణమయిన 317 జీవోను రద్దు చెయ్యాలని, సీపీఎస్ విధానంను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను పున రుద్దరించాలని సోమవారం పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు హాట్కార్ సమ్మయ్య ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క టీపీటీ ఎఫ్ జిల్లా నాయకులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రితో మాట్లాడి 317 జీవోను, సీపీఎస్ విధానంను రద్దు కొరకు కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు, వి. శ్యామ్ సుందర్, పి.ఉప్పుస్వామి, వి. దిలీప్,వివిధ మండల బాధ్యులు, జె. నాగరాజు, బి. సారంగపాణి, వి. స్వామి, ఎల్. రమేష్,ఎం. శ్రీనివాస్,డి.రమేష్,బి. గోపినాద్, వి. సారయ్య,ఎస్.రవీందర్, పి. రఘురాం, బి. మోహన్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “317 జీవో రద్దు చెయ్యాలని మంత్రి సీతక్కకు వినతి”

Leave a comment