వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం.
– తరలివచ్చిన భక్తజనం : శివాలయంలో వెల్లివిరిసిన భక్తి భావం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం లో వేంచేసి యున్న శ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లో సోమవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. సుబ్ర మణ్యేశ్వర స్వామి వారి షష్టి సందర్భంగా వేకువ జాము నుండి భక్తులు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్ణయించిన సమయానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా, భక్తులు స్వామి నామ స్మరణ ల మథ్య అంగ రంగ వైభవంగా కన్నుల పండగ వీనుల విందుగా అర్చకులు కళ్యాణాన్ని నిర్వహించారు.ఈ సందర్భం గా ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం ఆలయ కమిటీ వారిచే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్ర మణ్యం షష్టి స్వామి కళ్యాణ మహోత్సవానికి వందల సంఖ్య లో భక్తులు తరలివచ్చి కల్యాణం తిలకించి , అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఇష్టపూర్వకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించిన వేద పండితులు,ఆలయ కమిటి భక్తులు కు పంపిణీ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి, కళ్యాణ మహోత్సవాల సందర్భంగా శ్రీ ఉమారావలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
1 thought on “వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. ”