ములుగు జిల్లా కార్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా రేండ్ల సంతోష్
ములుగు, తెలంగాణ జ్యోతి : సమ్మక్క సారక్క ములుగు జిల్లా కార్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా రేండ్ల సంతోష్ ను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ములుగు గట్టమ్మ సన్నిధిలో సమ్మక్క సారక్క కార్ యూనియన్ సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సంతోష్ మాట్లాడారు. కార్ డ్రైవర్స్ ఓనర్స్ లకు ఏ విధమైన సమస్య తలెత్తిన పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు ఎల్లవేళ లా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో సమ్మక్క సారక్క కార్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకల సంజీ వ్, నల్ల కోమల్ రెడ్డి, మాట్ల బద్రి (బాస్ స్టూడియో) కాంతాల సమ్మి రెడ్డి, బండి శ్రీనివాస్, ఉప్పుల రేవంత్ రెడ్డి, ఆంగోత్ సురేష్,అజ్మీరా రాజేష్, పిట్టల గిరి,అజ్మీరా రాంసింగ్,గొంది చంద్,అంగుజా రామ కృష్ణ,సకినాల దిల్,అజ్మీరా వినోద్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు
1 thought on “ములుగు జిల్లా కార్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా రేండ్ల సంతోష్”