చీకుపల్లి చేరుకున్న అయోధ్య రాముడి అక్షింతలు.
– ఎదురేగి స్వాగతం పలికిన శ్రీ రామ భక్తజనులు
– శ్రీరామ నామం జపంతో మారుమోగిన గ్రామాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు శ్రీరామ ఆలయానికి గురువా రం అయోధ్య శ్రీరామ, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర అక్షింతలు అయోధ్య నుండి ,శ్రీ రామ ఆలయ కమిటీ వారు పంపిన అంక్షిం తలు లక్ష్మీపురం కు తీసుకువచ్చేందు కమిటీ విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు. 500 ల సంవత్సరాల తర్వాత మన రాముడు మన ఇంట్లోకి రాబోతున్న శుభ సందర్భంలో, అయోధ్యలో 22 న జరుగుతున్న శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా,అయోధ్య ఆలయ కమిటీ వారు దేశం నలుమూలలు స్వామి వారి అక్షింతలు పంపించారు. ఇందులో భాగంగా పలు దేవాలయాలకు గ్రామాలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ వారు భక్తులు పంపిణీ చేశారు. ఇంటింటికి, గడప,గడపకు శ్రీరామచంద్రమూర్తి అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమాల్లో భాగంగా, శ్రీరామ భక్తులు మేళతాళాలతో అక్షిం తలను కళశాలలో ఊరేగింపుగా స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలతో జై శ్రీరామ జై జై శ్రీరామ జై శ్రీ ఆంజనేయ అంటూ, స్వామివారి శ్రీరామ తీర్ధ్ క్షేత్ర భక్తి రస పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలకు పంపించి నటువంటి అక్షింతలు తీసుకొస్తున్న సందర్భంగా గ్రామస్తులందరూ ఇల్లు శుభ్రం చేసుకోని ఇంటింటికి పంచి నటువంటి అక్షింతలను ఆయోధ్యలో జరగబోతున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట అనగా ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో, 500 సంవత్సరాలకు గుర్తుగా 5 దీపాలు ఇంట్లో వెలిగించి, అక్షింతలు శిరస్సు మీద ధరించి (కొన్ని అక్షింతలు దాచుకొనండి. ఇవి భవిష్యత్ తరాలకు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రుని తలంబ్రాలని చెప్పుకోవడానికి ఉంటుందని భక్తులు కోరారు. శంఖం ఉంటే శంఖం ఊదడం కానీ, గంట మోగించడం గాని చేసి హిందువులంతా, శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందా లని శ్రీరామ భక్తమండలి అయోధ్య రామయ్య ఆశీస్సులను పొందా లని కోరారు. తలంబ్రాలను ఆంజనేయ స్వామి మాలలు ధరించి నటువంటి గట్ల చిరంజీవి, వాసం కమల, రేగ కార్తీక్, గుండెబోయిన శరత్, మడప మధు, మడప పగడయ్య, తెల్లం నరసింహారావు, గొంది రాము మరియు గ్రామ పెద్దలు ,భక్తులు సమక్షంలో మేళ్ల తాళాలతో ఘనంగా జైశ్రీరామ్, జై జై శ్రీరామ, జై శ్రీరామాంజనేయ అంటూ అశేష భక్త జనులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. పాడి పంటలు సక్రమంగా పండాలని, అష్ట ఐశ్వర్యాలు , ఆయురారోగ్యాలు కలగాలని, అందరు సుఖసంతోషాలతో ఉండా లని, అయోధ్య రాముడి ఆశీస్సులు, విశ్వ వ్యాప్త రామ భక్తులకు, శ్రీరామ, జయ రామ జయ జయ రామ అంటూ, అంజన్న హను మాన్ మాలథారణ స్వాములు, హనుమాన్ భక్తులు, జై శ్రీరామ్ అంటూ భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర కమిటి తరపున భక్తిరస కార్యక్రమంలో తరలివచ్చి, స్వామివారి ఆశీస్సులు పొందా లని హనుమాన్ మాలథారణ స్వాములు, శ్రీ రామ భక్తులు పిలుపునిచ్చారు.
1 thought on “చీకుపల్లి చేరుకున్న అయోధ్య రాముడి అక్షింతలు. ”