విజన్ పాఠశాలలో ఘనంగా రంగోలి పోటీలు
సంక్రాంతి సందర్భంగా విద్యార్థుల సృజనాత్మకతకు వేదిక
వెంకటాపురం నూగూరు, జనవరి 9 (తెలంగాణ జ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ ప్రైవేట్ పాఠశాలలో రంగోలి పోటీలను ఘనంగా నిర్వ హించినట్లు పాఠశాలయాజమాని బాహుబలేంద్రుని వెంకట రామారావు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారన్నారు. పోటీల అనంతరం మొదటి, రెండవ, మూడవ బహుమతులతో పాటు ఉత్తమ 10 రంగోలి చిత్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి అభినందించినట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపు కున్నామన్నారు, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని, విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.





