వెంకటాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఊడలు దీరిన అవినీతి.
– మెనూ చార్ట్ ప్రకారంగా పౌష్టిక ఆహారం అందించాలి.
– ఆశ్రమ పాఠశాల అవినీతిపై విచారణ జరిపించాలి.
– అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం
– జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో పర్య టించిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ కు వెంకటాపురం మండలం చిరుత పల్లి 1,2, మరియు లక్ష్మీనగరం ఆశ్రమం పాఠశాలలో మెనూ ప్రకా రంగా ఆదివాసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించటంలేదని ,జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో ఆశ్రమ పాఠశాలలో ఆదివాసి విద్యార్థులు చదువుకున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి విద్యార్థుల కోసం అనేక నిధులు విడుదల చేసినప్పటికీ ఆశ్రమ పాఠశాలలో అవినీతి వార్డెన్లు తయారయ్యారని ,హాజరు పట్టీ లో పూర్తిస్తాయి హాజరు వేసి విథ్యార్థులు లేక పోఇన మెస్ చార్జీలు స్వాహో చేస్తు న్నారని ఆయన ఆరోపించారు.దీనికి ప్రత్యేకంగా ఆదివాసి సంఘ నాయకులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసి గుడాలల్లో ఆదివాసి విద్యార్థులు విద్య కు దూరమై ఇబ్బందులు పడుతున్న అధికారుల పట్టించుకోవటం లేదని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ప్రకారం గా ఆదివాసీలు అన్నిటికీ దూరంగా ఉన్నారని, ఐక్యరాజ్యసమితి గుర్తించి ఐదు, ఆరు షెడ్యూల్ రచించారని ఆయన గుర్తు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మెనూ ప్రకారంగా ఆదివాసి విద్యా ర్థులకు పౌష్టికాహారం అందించాలని ,పాఠశాలలో అవినీతి అరి కట్టాలని అదనపు కలెక్ట ర్ కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. ఆశ్రమ పాఠశాలలో జరిగే అవినీతి, అక్రమాలపై జి.ఎస్.పి మరో పోరాటానికి సిద్ధమవుతామని ఆయన అన్నారు.జిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కనితి వెంకటకృష్ణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్తదితరులు అదనపు కలెక్టర్ ను కలసిన వారిలో వున్నారు. .
1 thought on “వెంకటాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఊడలు దీరిన అవినీతి.”