మత సామరస్యానికి ప్రతీక “రంజాన్ ”
– ఎంపీపీ సమ్మయ్య
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మండల కేంద్రం గారేపల్లె లోని మజీద్ లో రంజాన్ వేడుకలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా గురువారం మజీద్ లో జరిగిన ప్రార్ధనలో పాల్గోని ముస్లిం సోదరలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీపీ సమ్మయ్య మాట్లాడుతూ మానవ సేవ అత్యుత్త మైనదనీ చాటి చెప్పే ఈ పండుగ లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని పండుగ శుభాకాంక్షలు తేలియజేసుకున్నారు.