వాజేడు మండలం నూతన ఎస్సైగా రాజకుమార్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వాజేడు మండ లం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా రాజ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గత నెల రెండవ తేదీన ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో ఖాళీ అయిన పోస్టును, నెల రోజుల తర్వాత పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఎస్సైగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ను వాజేడు కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడడమే కాకుండా, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తానని అన్నారు.