Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

బొట్ల ప్రశాంత్‌కు అభినందనలు తెలిపిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

On: December 17, 2025 1:51 PM

బొట్ల ప్రశాంత్‌కు అభినందనలు తెలిపిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

ములుగు, డిసెంబర్ 17,తెలంగాణ జ్యోతి: ములుగు మండలం జాకారం గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా విజయం సాధించిన బొట్ల ప్రశాంత్‌ ని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు. బొట్ల ప్రశాంత్‌  మాట్లాడుతూ, గెలుపుకు సహకరించిన జాకారం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!