కోరం లేక వాయిదా పడిన మండల ప్రజా పరిషత్ సమావేశం.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ అధ్యక్షతన జరగగా పూర్తిస్థాయి కోరం లేక వాయిదా పడింది. అయితే ఎన్నికల కోడ్, ఎన్నికల విధుల్లో భాగంగా అనేక శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతేకాక ప్రజాప్రతినిధులు కూడా పూర్తిస్థాయిలో సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు.90 రోజుల క్రితం జరిగిన సమావేశం అనంతరం మరల మంగళవారం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ, పూర్తిస్థాయి కోరం లేకపోవడం వల్ల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, కొద్ది శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ అదికారులు హాజరు అయ్యారు. జడ్పిటిసి సైతం సమావేశంలో పాల్గొనలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మండల పరిషత్ అధ్యక్షులు సతీష్ కుమార్ ప్రకటించారు.