పుట్ట మధు చిల్లర రాజకీయాలు మానుకోవాలి
– మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మంథని నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్ హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాషణ సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దీళ్ళ శ్రీను బాబులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించు కోవాలని యూత్ కాంగ్రెస్ పక్షాన చీమల సందీప్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జరిగిన ఎన్నికల్లో పేద బిడ్డను, పెంకుటింట్లో, అంబలి తాగి, అటుకులు తిని పెరిగిన అని చెప్పి మంథని నియోజకవర్గ ప్రజలను నమ్మించి పుట్ట మధు ఎన్నికల్లో గెలిచారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన క్షణం నుండి పుట్ట మధు అక్రమ ఆస్తులు సంపాదించడం మొదలు పెట్టాడని, అలాగే తన కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి అడ్డొచ్చిన వారిని నిర్ధాక్షిణ్యంగా నడి రోడ్డు మీద హత మార్చిన సందర్భాలను నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కొన్ని నెలల వ్యవధిలోనే మంథని నియోజక వర్గం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఈ క్రమం లో మంత్రి శ్రీధర్ బాబుకు జనంలో పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు లపై పుట్ట మధు అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సందీప్ పేర్కొన్నా రు. పార్టీ పదవి లేకున్నా ప్రజా సమస్యలను తీర్చేందుకు శ్రీను బాబు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో నిత్యం పర్యటిస్తు న్నారని, అందువలన నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఎవరి కి ఎలాంటి అపాయం జరగకూడదని పోలీస్ అధికారులు ముందు జాగ్రత్తలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రని తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు మీద అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా మధు ఎదగాలనుకుంటు న్నాడని, ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు పది తరాలకి సరిపడ అక్రమ అస్తులని సంపాదించుకొని మంథని నియోజకవర్గన్ని రౌడీ రాజ్యంగా మార్చారని, మంథని ప్రజలు సత్య, అసత్యాలని గ్రహించి మళ్ళీ రెండు పర్యాయాలు శ్రీధర్ బాబును గెలిపించినట్లు గుర్తు చేశారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చీమల సందీప్ ఘాటుగా హెచ్చరించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.