వీరయ్య ప్రమాణస్వీకార మహోత్సవానికి భారీ గా తరలి వెళ్లి న కాంగ్రేస్ నేతలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా హైదరాబాదులో ప్రమాణస్వీకార మహోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీగా తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారోత్సవం లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పట్టు శాలువాలతో సన్మానాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ప్రాథమిక సహకా ర సంఘం అధ్యక్షులు చిడెం మోహన్ రావు ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షులు మన్యం సునీల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, ఎంపీటీసీ రవి, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల క్రాంతి, రావుల నాని, మురళి, సుధాకర్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.