వెంకటాపురంలో ప్రజా పాలన దినోత్సవం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రజా పాలన దినోత్సవం మణంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి అభివాదం చేశారు. వెంకటాపురం రెవిన్యూ కార్యాలయం వద్ద తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏ డి ఈ ఆకిటి స్వామి రెడ్డి జాతీయ జెండాలను ఎగరవేశారు. అలాగే వివిద ప్రభుత్వ కార్యాలయాల్లో శాఖాధిపతులు, ఉపాధ్యాయులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జాతీయ జెండాలను ఎగుర వేసి ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు.