గ్రామాల్లో హోరెత్తిన స్వామివారి నిమజ్జన కార్యక్రమం
– భాజా భజత్రీలు భజనలు కోరాటాలతో సందడే సందడి
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా, సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలలలో నిమజ్జ నం ఉత్సవాలు అంగరంగ వైభవంగా, జై గణేశా, జై జై గణేశా అనే నినాదాలతో పలు గ్రామాల్లో భక్తి రస కార్యక్రమం హోరె త్తించింది. డీ.జే పాటలను పోలీస్ శాఖ నిషేధించడంతో, స్వామివారి ఊరేగింపులో సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలతో భక్తిరస సాంప్రదాయబద్దంగా స్వామివారి విగ్రహాన్ని ట్రాక్టర్ లలో ప్రతిష్టింపజేసి కోలాటాలు, భజనలు, జై. జై. గణేశ జై గణేశ అంటూ దిక్కులు పీక్కు టిల్లే విధంగా స్వామివారిని స్మరిస్తూ పురవీధులలో స్వామి వారిని ఊరే గించారు. ఈ సందర్భంగా గోదావరి నదులలో, మరియు వెంక టాపురం మండలంలోని నవరాత్రి ఉత్సవ కమిటీలు స్వామి వారిని బల్లకట్టు వాగులో సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా నవరాత్రి ఉత్సవ కమిటీలు అన్నదానాలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం ముగించు కొని, సాయంత్రం వేళ స్వామివారి ని ట్రాక్టర్లలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని అత్యం త భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్త సోదరిమణులు కోలాటా లతో స్వామివారి ఊరేగింపు వాహనం ముందు కోలాటం వేసి, వెళ్లి రావయ్యా శ్రీ గణపయ్య వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం. పాడి పంటల సక్రమంగా పండాలని, సకల జనులు సుఖశాం తులతో ఉండాలని ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవ కమి టీలు స్వామివారిని వేడుకున్నారు .ప్రధాన వీధులలో ఊరేగింపు సందర్భంగా భక్తులు శుద్ధిజలంతో స్వామివారికి ఆరబోసి పసుపు, కుంకాలు టెంకాయలతో స్వాగతించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవ కమిటీలు స్వామివారి ఇష్టపూర్వకమైన పులిహోర ఇతర ప్రసాదాలను భక్తులకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు.