నిషేధిత గడ్డి మందు పట్టివేత
కాలేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరంలోని ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ బార్డర్లో మహాదేవపూర్ సిఐ బి.రాజేశ్వరరావు కాళేశ్వరం ఎస్సై భవాని సేన మరియు మహాదేవపూర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులు నిషేధిత గడ్డి మందును పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… నమ్మదగిన సమాచారం మేరకు చెక్ పోస్ట్ బార్డర్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సిరంచలోని పోచంపల్లికి చెందిన చల్ల మహేష్ అను వ్యక్తి ఎలాంటి ప్రభుత్వం అనుమతి పత్రాలు, రసీదులు లేకుండా 70 లీటర్ల గ్లైసిల్ గడ్డి మందును కాలేశ్వరం మీదుగా మహాదేవ్ పూర్ చుట్టుపక్కల ప్రాంతా లకు తరలిస్తుండగా 70 లీటర్ల గ్లైసిల్ గడ్డి మందును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సి ఆర్ పి పోలీసులు ఉన్నారు.
1 thought on “నిషేధిత గడ్డి మందు పట్టివేత”