24న ప్రొఫెసర్ సాయిబాబా సంతాప సభ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మానవ హక్కుల నేత, ప్రజాస్వామీక హక్కుల కోసం పోరాడిన గొప్ప మేధావి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంతాప సభను ఈనెల 24న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయం లో నిర్వహిస్తున్నట్లు టీ పీ జె ఏ సీ జిల్లా కన్వీనర్ సమ్మయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు హాజ రై నివాళులు అర్పించాలని ఆయన కోరారు.