మృత కుటుంబానికి అండగా ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బేగులూరు గ్రామానికి చెందిన దోమల రమేష్ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవలే ప్రమాదవశాత్తు లారీ ఆక్సి డెంట్లో చనిపోయాడు. ఇతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారి నిరుపేద కుటుంబ పరిస్థితి తెలుసుకున్న జయశంకర్ ఫౌండేషన్ టీం సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి 11వ రోజు దినకర్మ వంటకు సరిపడా 50 కిలోల రైస్ బ్యాగ్స్, నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందజేశారు. అలాగే వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోషన్న, యూత్ ఇన్చార్జి చింతకింది రాజు, నేన్నెల రాకేష్, ఉదారి హరీష్, తిరుపతి, తదితర సభ్యులు పాల్గొన్నారు