బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి
-ఎస్సై వెంకటేష్
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: దీపావళి సందర్భంగా కన్నాయిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో బాణసంచా దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టపాకాయలు ఏర్పాటు చేయాలం టే తప్పనిసరిగా పోలీస్ అనుమతి లేనిది ఎవరు కూడా టపాకాయలు క్రయవిక్రయాలు చేయవద్దన్నారు. ఎవరు అతి క్రమించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు.