అవగాహనతోనే నివారణ సాధ్యం
– ఆశ్రమ పాఠశాల పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అవగాహనతోనే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని ఐ సి టి సి కౌన్సిలర్ గాదె రమేష్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాల పల్లి జిల్లా, కాటారం మండలం, మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవి నిర్వచనం, వ్యాధుల సంక్రమణ, వ్యాప్తి నివారణ మార్గాలు, అవకాశవాద రోగాల సంక్రమణ, నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, వివక్ష నిర్మూలన చట్టం వివరణ, ఏ ఆర్ టి మందులు తదితర అంశాలపై మహాదేవ పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సమీకృత సలహా పరీక్ష కేంద్రం కౌన్సిలర్ గాదె రమేష్ కూలంకషంగా అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఎయిడ్స్ పై నిర్వహించిన ఉపన్యా స పోటీలో ఉత్తమ విజేత కావ్యకు బహుమతిని అందజే శారు. అంతకుముందు మేడిపల్లి గ్రామపంచాయతీ కార్యాల యం యందు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మేడిపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వివరించారు. డ్రై డే నిర్వహించారు. జ్వరాల సర్వే, రక్త నమూనాలను సేకరించారు. ఉచిత ఆరోగ్య శిబిరంలో ప్రజలకు మందులు అందజేశారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ గాదె రమేష్ తో పాటు సి హెచ్ ఓ నిర్మల, హెల్త్ అసిస్టెంట్ కాపర్తి రాజు, ఏఎన్ఎం కుమ్మరి రజిత, ఆశ కార్యకర్త కొండ గొర్ల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాకేష్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సృజన, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు