ఇళ్ళ జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలి
– ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ వేయాలి
– ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశం
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : కుల గణన సర్వేలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో సర్వేను ఆకస్మికంగా తణిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, ఇళ్ళ జాబితా తయారీ లో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా తయారు చేయా లని, ప్రతి ఇంటి యజమాని ఇంటికి స్టిక్కరింగ్ వేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటాపురం, వాజేడు మండలంలో సర్వేను ఆకస్మికంగా తనిఖీలు నిర్వ హించారు. వాజేడు మండలంలోని బొల్లారం, వెంకటా పురం మండలంలోని వి ఆర్ కె పురం, వెంకటాపురం, వీర భద్రవరం, నూగురు, ఇంకా అనేక పంచాయతీ గ్రామాలలో సర్వే యొక్క పనితీరును పరిశీలించి అక్కడి కక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీ డీవో రాజేంద్రప్రసాద్, ఎంపీఓ హనుమంతరావు,ఆయా పంచా యతీల కార్యదర్శిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.