ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలకు విశేష స్పందన. 

ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలకు విశేష స్పందన. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్రామ సభలకు ఆయా పంచాయతీల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దరఖాస్తులను అందజేశారు. వెంకటాపురం మండలంలోని వీరభద్రారం లో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి గ్రామసర్పంచి సమ్మక్క అధ్యక్షత వహించారు.ఈ మేరకు పంచాయ తీ కార్యదర్శి సంజీవరావు ప్రజా పాలన యొక్క లక్ష్యాలను, ముఖ్య మంత్రి సందే శాన్ని ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తులు స్వీకరణ కేంద్రంలో ప్రజలకు చదివి వినిపించారు. అలాగే రేషన్ కార్డు లేకపో యినా దరఖాస్తులు ఇవ్వవచ్చని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా దరఖా స్తులు పూర్తి చేసి అందజేయాలని అధికారులు కోరారు. మండలం లోని మరికాల పంచాయతీలో జరిగిన ప్రజా పాలన అభయహస్తం గ్రామ సభలకు గ్రామ సర్పంచ్ వాసం సత్యావతి అధ్యక్షత వహిం చారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రజా పాలన దరఖాస్తులను అందజేశారు. వాలం టీర్లతో దరఖాస్తులను నింపి, స్వీకరణ కేంద్రాల వద్ద అధికారులు ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రామ సభలో మండల పంచాయతీ అధికారి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ ప్రజాపాలన టీం సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, తహ సిల్దార్ సమ్మ య్య, తదితరులు ప్రజాపాలన గ్రామ సభలకు హాజరై పర్యవేక్షించా రు. ప్రభుత్వం కల్పించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ తమ దర ఖాస్తులను అందజేయాలని  అధికారులు ప్రజలను కోరారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభలకు విశేష స్పందన. ”

Leave a comment