వీరభద్రవరంలో పెసా గ్రామ సభ వాయిదా.
– ఆదివాసీల మధ్య ఐకమత్యం లేక సభలో గందరగోళం.
– వాయిదా వేసిన అధికారులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇసుక సొసైటీ పెసా గ్రామసభ గ్రామ ఆదివాసీల మధ్య ఐకమత్యం లేకపోవడంతో తీవ్ర గందరగోళం మధ్య అధికారులు గ్రామ సభను నిరవధికంగా వాయిదా వేశారు. గత డిసెంబర్ నెలలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, ములుగు జిల్లా ఎస్పీ, మండల అధికారుల సమక్షంలో వీరభద్రవరం లో గ్రామసభ నిర్వహించారు. అయితే అప్పుడు కూడా పెసా గ్రామసభ లో ఆదివాసీల మధ్య ఐకమత్యం లేకపోవడంతో, నిరవధికంగా గ్రామ సభను వాయిదా వేశారు. తిరిగి రెండు నెలల అనంతరం శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ పీవో, ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశం పై గోదావరి ఇసుక సొసైటీ ఆమోదం కొరకు పెసా గ్రామ సభను అధికారులు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు, మండల తాసిల్దార్ స్పెషల్ ఆఫీసర్ ఎస్డి సర్వర్, ములుగు జిల్లా పెసా కో ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఎస్.ఐ .ఆర్. అశోక్, ఎంపీటీసీ సాంబ శివరావు పలువురు ఆధ్వర్యంలో, గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని ఆదివాసి కుటుంబాలు రెండు వర్గాలుగా విడిపోయి, నకిలీ ఆదివాసీలు ఉన్నారని, బీసీ వాళ్లు కూడా ఎస్టీలుగా చలామణి అవు తున్నారని ఎస్. టి.సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే ఓటింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళలు పట్టు పట్ట టంతో గ్రామసభలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఇరువైపుల వారు వాగ్వివాదానికి దిగారు. ఒకరిపై ఒకరు కులం పై ఆరోపణలతో గ్రామసభలో గందరగోళ పరిస్తి తులు నెలకొన్నాయి. రికార్డు ప్రకారం వీరభద్రవరంలో, 256 ఎస్టీ ఓట్లు నమోదు ఉన్నాయని, వారిలో మూడో వంతు ఓటర్లు, హాజరైతే సభ కొనసాగించవచ్చునని అధికారులు ప్రకటించారు. దీంతో ఎస్టీ కుల పత్రాలు ఉన్నవారు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వాగ్యీవాదం కు దిగారు. అధికారులు సభాముఖంగా పలుమార్లు నచ్చ చెప్పిన వినకపోవడంతో, శాంతి భద్రతలు సమస్యలు నెలకొనే విధంగా ఉన్నాయని, సభలో జరుగుతున్న, జరిగిన వివరాలు పరిస్థితులను, జిల్లా ఉన్నతాధికారులకు తెలియపరిచారు. దీంతో శాంతి భధ్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, పెసా గ్రామ సభను వాయిదా వేస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్, మండల తాసిల్దార్ ఎస్. డి. సర్వర్ ప్రకటించారు. దీంతో రెండు నెలల తరువాత నిర్వహించిన పెసా గ్రామసభ వీరభద్రవరం లో రెండోసారి కూడా వాయిదా వేశారు. కొంతమంది ఆంధ్రా ,టిఎస్. ఇసుక మాఫియా తమ వ్యక్తిగత స్వలాభం కోసం, గ్రామాల్లో వివాదాలు సృష్టిస్తున్నారని, సొస్సటీలను దక్కించుకునేందుకు ఆదివాసులను ఐకమత్యం లేకుండా విడగొడుతున్నారని, పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు.