నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఆరోపణలు

నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఆరోపణలు

– బీజేపీ మహిళా మోర్చ నాయకురాలు ఆకుల నీలిమ

నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని, రూ.కోటి టోకరా వేసి పరారైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆకుల నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పూసల గల్లీలో తన ఇంట్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ దగ్గరి బంధువు బింగి మధు వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించానని తెలిపారు. కానీ బింగి మధు మాత్రం తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో మీ భార్య కు డబ్బులు ఇచ్చానని చెప్పినప్పటికీ, డబ్బులు ఇవ్వలేదని చెప్ప డంతో ఆవేదనకు గురైనట్లు తెలిపారు. తాను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదని వారి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నట్లు పత్రాలు ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవాలని,కానీ నాపై తమ పార్టీకీ ఫిర్యాదు చేయడం సరైంది కాదన్నారు. తాను నిజంగా కోటి రూపాయల డబ్బులు అప్పు తీసుకుని చెల్లించని పరిస్థితి ఉంటే ఐపీ పెట్టే దానినని అన్నారు. దీనిపై ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు నీలిమ తెలిపారు. తనను వేధించడంతో ఆస్పత్రి పాలయ్యానని, తనతోపాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ రాకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాని ఆమె ఆరోపించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment