అక్రమ రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్న పోలీసులు
కాటారం, తెలంగాణ జ్యోతి : కబేలాలకు పశువుల అక్రమ రవాణాకు కాటారం పోలీసులు చెక్ పెట్టారు. కాటారం సబ్ డివిజన్ నుండే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర నుండి జాతీయ రహదారి గుండా పెద్ద ఎత్తున పశువుల రవాణా జరుగు తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం రాత్రి కాటారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. చత్తీస్గడ్ నుండి హైదరాబాద్ కు పశువులను వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తుండగా కాటారం పోలీసులు పట్టుకన్నారు. పోలీస్లు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానంతో వ్యాన్ తనిఖీ చేయగా వ్యాన్ లో 30 పశువులు ఉన్నాయి. పట్టుకున్న పశువులను భూపాలపల్లి మండలంలోని రాంపూర్ గోశాలకు తరలించినట్లు కాటారం ఎస్సై అభినవ్ తెలిపారు. కాటారం వెటర్నరీ డాక్టర్ ధీరజ్, అటెండెంట్ అక్రం, హెచ్ సి రమణయ్య ఉన్నారు. ప్రొబేషనరీ ఎస్సై గీత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.